హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
కారెంపూడి: పల్నాటి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న ఎడ్ల పోటీలలో భాగంగా బుధవారం న్యూ కేటగిరి విభాగంలో పోటీలు జరిగాయి. పోటీలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ విభాగంలో ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం మద్దిరాలకు చెందిన పుచ్చకాయల శేషాద్రి చౌదరి ఎడ్ల జత బండను 5051.11 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని కై వసం చేసుకున్నాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత 5000 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం సాధించాయి. కాకుమాను మండలం కొండబలవారిపాలెంకు చెందిన జీపీ బుల్స్, గుడవల్లి లక్ష్మీదీక్షిత్ చౌదరి కంబైన్డ్ ఎడ్లజత తృతీయ స్థానాన్ని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం పిన్నెల్లికి చెందిన పిక్కిలి తేజశ్వ మురళి ఎడ్ల జత నాలుగవ బహుమతిని, మేడికొండూరు మండలం సరిపూడి గ్రామానికి చెందిన వెదుళ్లపల్లి శ్రీనివాసరావు, పాలడుగు గ్రామానికి చెందిన శాఖమూరి విజయ్‌కుమార్ కంబైన్డ్ జత ఐదవ స్థానంలో నిలిచాయి. అలాగే ఆరవ బహుమతిని రాజుపాలెంకు చెందిన డప్పులపూడి వినోద్‌కుమార్, పల్నాడు జిల్లా మాచవరంకు చెందిన కేవీఆర్ నాయుడు కంబైన్డ్ జత గెలుచుకున్నాయి. కమిటీ సభ్యులు బొమ్మిన శ్రీనివాసరావు, బొమ్మిన శేషగిరిరావు, నాగారపు రామకృష్ణ, పలిశెట్టి హనుమంతరావు, పలిశెట్టి శ్రీను. చింతపల్లి రామ్మూర్తి తదితరులు విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. బహుమతులను దాతలు గ్రామ ఇన్‌ఛార్జి సర్పంచ్ బాణా వతు సరస్వతీ బాలు నాయక్, చెన్నకేశవ స్వామి దేవస్థానం ఈఓ, ఫర్టిలైజర్స్ అసోషియేషన్ నాయకులు, బూసా రామాంజనేయులు, రమావతు నాగుల్ నాయక్, లీలాలక్ష్మీ ప్రసన్న అందించారు.
న్యూకేటగిరి విభాగం విజేత శేషాద్రి చౌదరి ఎడ్ల జత
హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు


