
ఖరీఫ్‌లో ముంపు ముప్పు
రేపల్లె: ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా అటు పాలకులు, ఇటు అధికారులు పూడికతీతపై నోరు మెదపడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్‌కు ముందే అవసరమైన డ్రెయిన్‌లలో తూటికాడ, గుర్రపు డెక్క, పిచ్చిమొక్కలను తొలగించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
రేపల్లె సబ్ డివిజన్‌లో ఇలా...
రేపల్లె సబ్ డివిజన్‌లో ప్రధానంగా ఆర్‌ఎం డ్రెయిన్, బీఎం డ్రెయిన్, జగజ్జేరువు కాలువ, రేపల్లె మురుగు కాలువ, వాడ మురుగు డ్రెయిన్, రేపల్లె న్యూకోర్స్, ఓల్డ్ కోర్స్‌లలో తూటి కాడ, గుర్రపు డెక్క, ప్లాస్టిక్, చెత్త చెదారాలు పేరుకుపోయాయి. రేపల్లె నియో జకవర్గంలోని రేపల్లె, రేపల్లె మండలం, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాలలో 34,060 హెక్టారులలో ఖరీఫ్‌లో వరి సాగు అవుతుంది. ఇక్కడి వృథా నీరు, అధిక వర్షాలు కురిసిన సమయంలో వరద ఈ కాల్వల ద్వారానే ముందుకు పో వాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లే దు. పంట చివరి దశ నవంబర్, డిసెంబరు మా సాలలో ఈ ప్రాంతాలలో అధిక వర్షం పడుతుంది. దీంతో రైతన్నలు భయాందోళనలకు గురవుతున్నారు.
యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే..
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా పూడికతీత చేపట్టకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. గత ఏడాది ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలతో రైతులు కొంతమేర నష్టపోయారు. ఇప్పటికై నా యుద్ధప్రాతిపదికన పూడిక తీత ప్రారంభిస్తేనే ప్రయోజనం ఉంటుంది. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఖరీఫ్‌లో వరి పంటకు ముంపు ముప్పు తప్పేలా లేదు. రేపల్లె నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. ప్రధాన మురుగు కాలువలతోపాటు మైనర్, రోడ్డు పక్కన ఉన్నవి కూడా గుర్రపు డెక్క, తూటికాడ, గడ్డి వంటి చెత్తతో పూడిపోయాయి. వర్షాలు ఊపందుకుంటే నీరు ముందుకు సాగని స్థితిలో కాలువలు ఉన్నాయి. పక్కనే ఉండే పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
గుర్రపు డెక్క, తూటి కాడతో పూడుకుపోయిన డ్రెయిన్లు
పూడిక తీసేందుకు కనీస చర్యలు చేపట్టని కూటమి సర్కార్
ఈ ఏడాది పంటకు ముంపు తప్పదని ఆందోళనలో అన్నదాతలు
నాడు ఖరీఫ్‌కు ముందే పనులు పూర్తి చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం