
ఎండగడదాం
కూటమి వంచనను
ఇంత తక్కువ కాలంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికి ఇంత ప్రజా వ్యతిరేకత రాలేదు. ఎటు చూసినా దోపిడీలే.. కూటమి కార్యకర్త సైతం దొరికిందల్లా దోచుకుంటూ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నాడు. ప్రశ్నిస్తే కేసులు పెడతారనే భయంతో ప్రజలు బయ టకు రావడం లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు రాగానే తల్లికి వందనం అందజేశారు. లేకుంటే అమలు చేసేవారే కాదు. మన కార్యకర్తలు ప్రశ్నించడం మొదలు పెడితే ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత ప్రారంభమవుతుంది. బాబు ష్యూరిటీ–మోసాలు గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.
– బొల్లా బ్రహ్మనాయుడు,
వినుకొండ మాజీ ఎమ్మెల్యే
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీల అమలును పక్కనబెట్టి ప్రజలను మరొకసారి నిలువునా వంచించారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్‌లోని కుంచనపల్లి ఫార్చ్యూన్ గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల నాయకుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. దానిలో భాగంగానే జిల్లాస్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం కొత్తేమి కాదని, 1999 నుంచి ఆయన ఇదే పద్ధతి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు.
● జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డు, గ్రామస్థాయిల్లో సమావేశాలు నిర్వహించి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలులను, చంద్రబాబు ప్రభుత్వం మోసగించిన విధానాన్ని ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్నికలకు ముందు ఏఏ పథకాలు వస్తాయని బాండ్లు ఇచ్చారో, వాటిని సేకరించి వారికి ఏఏ పథకాలు రాలేదో తెలుసుకుని, మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలను వివరించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు.
● వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటారని, జెండా మోసిన వారికి, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి, వినుకొండ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), గుంటూరు, పల్నాడు జిల్లాల వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.
కేసులకు భయపడం
వైఎస్సార్ సీపీ నాయకులకు, కార్యకర్తలకు కేసులు కొత్తేమీ కాదు. నాపై ప్రభుత్వం 90 కేసులు పెట్టింది. మన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనేక కేసులు పెడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రజా పరిపాలన చేసేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.
– పూనూరు గౌతమ్ రెడ్డి,
నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు
తక్కువ కాలంలో పెద్దఎత్తున వ్యతిరేకత
వైఎస్సార్ సీపీ పల్నాడు – గుంటూరు జిల్లాల నేతల విస్తృత స్థాయి సమావేశం
పూర్తిస్థాయిలో ప్రజల్లోకి...
వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు ఇప్పటికే గమనించారు. ప్రశ్నించిన వారిపై కొంతమంది టీడీపీ నాయకులు దాడి చేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నమ్మకం సన్నగిల్లుతోంది. పార్టీ సూచనల మేరకు బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకెళ్లే విధంగా కృషి చేద్దాం.
– గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,
పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు
కార్యకర్తలే వారధులు
వైఎస్సార్ సీపీకి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నడుమ కార్యకర్తలే వారధులు. ఎన్నికలకు ముందు రెండు అబద్దాలు చెప్పి ఎన్నికల్లోకి వెళదామని పలువురు నాయకులు చెప్పినా వైఎస్ జగన్ అందుకు ఒప్పుకోలేదు. కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఏడాదిలోపే వ్యతిరేక సెగ భారీగా తగులుతోంది. మన నాయకుడు ఒక్క రెండుసార్లు బయటకు వస్తే అధికారుల్లోను, ప్రభుత్వంలోనూ మార్పు కనిపిస్తోంది. మనం పూర్తిస్థాయిలో పనిచేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం.
– మోదుగుల వేణుగోపాలరెడ్డి,
పార్టీ పల్నాడు, గుంటూరు జిల్లాల పరిశీలకులు
ఇంటింటికి చంద్రబాబు మోసాలు
హామీలు ఇచ్చి నెరవేర్చపోవడం
చంద్రబాబుకు ఇది మొదటిసారి కాదు
వైఎస్సార్ సీపీ హయాంలో అమలైన
సంక్షేమ పథకాలను ప్రజలకు
వివరించాలి
కూటమి సర్కారు మోసాలను,
సూపర్ సిక్స్ వైఫల్యాలను
ఇంటింటికి వివరించాలి
వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్,
రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి