
యువతను వంచించిన సర్కారు
నరసరావుపేట: విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి, విద్యాదీవెనలు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరుగుతున్న పీజీఆర్‌ఎస్‌కు హాజరై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎనుముల మురళీధర్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అన్నెం పున్నారెడి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పుతోళ్ల వేణుమాధవ్, వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు బూదాల కల్యాణ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, చిలకలూరిపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ప్రభు పాల్గొన్నారు.