గొరిగపూడి(భట్టిప్రోలు): మండలంలోని ప్రసిద్ధి గాంచిన గొరిగపూడి శ్రీ భ్రామరీ దుర్గాదేవి సమేత శ్రీ నాగేశ్వరస్వామి దేవస్థానం జీవధ్వజ విమాన గోపుర శిఖర సహిత పునః ప్రతిష్ట మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రాచీన ఆలయం జీర్ణోద్ధరణ గొప్ప కార్యమని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు.
ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు కోటి రూపాయలు, మేరుగ నాగార్జున రూ. 25 లక్షలు, పూర్వ గ్రామ కరణం, పులిగడ్డ వారి వంశస్తులు రూ. 25 లక్షలు అందించారు. గ్రామస్తులు వెండి సామగ్రి అందజేశారు. ఆదివారం మధ్యాహ్నం శాంతి కల్యాణం అనంతరం అన్న సంతర్పణ జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గరిగపాటి మల్లిక–వెంకటేశ్వరరావు, ఆలయ అర్చకులు ఆమంచి సృజన్ కుమార్, కార్యనిర్వాహణాధికారి పాపని రాజేశ్వరరావు పాల్గొన్నారు.
గొరిగపూడిలో నాగేశ్వరస్వామి ఆలయం పునరుద్ధరణ రూ.1.50 కోట్లతో నిర్మాణం
వైభవంగా పునఃప్రతిష్టా మహోత్సవాలు
వైభవంగా పునఃప్రతిష్టా మహోత్సవాలు