
అడ్డాగా మారుద్దాం
పల్నాడును వైఎస్సార్ సీపీ
నరసరావుపేట: పల్నాడు జిల్లాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారుస్తానని మాజీ ఎమ్మెల్యే, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించటంతో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు వందలాదిమంది మంగళవారం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో డాక్టర్ గోపిరెడ్డిని కలిసి అభినందనలు తెలియచేశారు. డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆరు నియోజకవర్గాల సమన్వయకర్తలు కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, మాజీ మంత్రి విడదల రజిని, గజ్జల సుధీర్ భార్గవరెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలోని నాయకులను కలుపుకొని పార్టీ కార్యక్రమాలను దిగ్విజయం చేస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి సలహాలు స్వీకరిస్తూ వారితో సంప్రదింపులు జరుపుతూ పార్టీని పటిష్టం చేస్తానని చెప్పారు. 2029 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని పేర్కొన్నారు. జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నెంపున్నారెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఈఎం స్వామి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్, నరసరావుపేట, రొంపిచర్ల మండలాల అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు షేక్ రెహమాన్, నరసరావుపేట పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, కార్యనిర్వాహక అధ్యక్షుడు అచ్చిశివకోటి, ఎన్.సురేంద్ర, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి