
వైఎస్ జగన్‌కు గోపిరెడ్డి కృతజ్ఞతలు
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ పీఏసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులు మంగళవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. ఆయనకు దుశ్శాలువా కప్పి తన నియామకంపై గోపిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సౌత్ జోన్‌కు అర్హత సాధించిన శివకోటేశ్వరమ్మ
రెంటచింతల: కేరళలో జరగనున్న సౌత్‌జోన్ రైఫిల్ షూటింగ్ పోటీలకు రెంటచింతల–2 సచివాలయం మహిళా పోలీస్ చిన్నపురెడ్డి శివకోటేశ్వరమ్మ అర్హత సాధించింది. జూన్ 21 నుంచి 30 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన 25 ఏపీ రైఫిల్ షూటింగ్ చాంపియన్ 2025 పోటీలలో 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో విశేష ప్రతిభను ప్రదర్శించి శివకోటేశ్వరమ్మ సౌత్‌జోన్ పోటీలకు ఎంపికై ంది. ఇంటర్ డిస్ట్రిక్ స్థాయిలో కూడా 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించిన శివకోటేశ్వరమ్మ తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ సౌత్‌జోన్ స్థాయి పోటీలకు అర్హత సాధించడం ఆమె కృషి, పట్టుదలకు నిదర్శనం. శివకోటేశ్వరమ్మ మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించినట్లు తెలిపారు.

వైఎస్ జగన్‌కు గోపిరెడ్డి కృతజ్ఞతలు