
శోభాయాత్రలో పాల్గొన్న శివనాగేంద్ర సరస్వతీ స్వామి
అమరావతి: కార్తిక మాసం ముగింపు సందర్భంగా అమరావతిలో కార్తిక దీప శోభాయాత్ర మంగళవారం రాత్రి నిర్వహించారు. అమరేశ్వరస్వామి దేవస్థానం ఈఓ వి.గోపినాథశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభాయాత్రలో భక్తులు తొలుత కార్తీక దీపాలతో అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరిదేవికి హారతులిచారు. శోభాయాత్రలో కాశీ పీఠాధిపతి శివనాగేంద్ర సరస్వతీ స్వామి, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు దంపతులు, వైఎస్సార్ సీపీ నాయకురాలు నంబూరు వసంతకుమారి పాల్గొన్నారు.
అమరేశ్వరుని సేవలో కాశీపీఠాధిపతి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరుని కాశీ పీఠాధిపతి శివనాగేంద్ర సరస్వతీస్వామి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులనుద్దేశించి అను గ్రహభాషణం చేశారు. తొలుత ఆయనకు ఆలయ ఈఓ వి.గోపినాథశర్మ, అర్చకులు స్వామికి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు దంపతులు, వైఎస్సార్ సీపీ నాయకులు నంబూరు వసంతకుమారి, ఎన్.బాబూరావు, వి.హనుమంతరావు పాల్గొన్నారు.