
జయపురం ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
కేంద్రం తీరుపై
జయపురం: ‘దొంగలందరికీ మోదీ అని ఇంటి పేరు ఎందుకు ఉంటుందో’ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్‌గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించడంపై ఆపార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ నాయకులు జయపురం ప్రధాన మార్గంలో శుక్రవారం నిరసన వ్యక్తంచేశారు. డీసీసీ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి ఆధ్వర్యంలో జయపురం మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుకాంత పట్నాయక్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బుల్లు సాహు, కోశాధికారి నిహారవన్ బిశాయి, కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు కేంద్రంతీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మకు నిప్పంటించారు. అనంతరం మీనాక్షి బాహిణీపతి మాట్లాడుతూ నీరవ్‌మోదీ, లలిత్‌మోదీ దేశంలోని వివిధ బ్యాంకులను మోసగించి, వేలాది కోట్ల రూపాయల రునాలు ఎగవేయడంతో పాటు విదేశాలకు పారిపోయారని గుర్తుచేశారు. వారంతా దొంగలు కాకుండా మరేవరని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం ఉద్వేశ పూర్వకంగా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నేతలపైన రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించు కుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్రం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉదృత్యం చేస్తుందని వివరించారు.
జయపురంలో నిరసనకు
దిగిన కార్యకర్తలు

ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న దృశ్యం