
కొరాపుట్: జిల్లా కేంద్రంలో తొలిసారిగా ఉగాది వేడుకలకు స్వీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని కొరాపుట్ సెంట్రల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్‌చంద్ర పాణిగ్రాహి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి వెలిగించారు. కార్యక్రమంలో కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం పొడాల్, సునాబెడా మున్సిపల్ చైర్మన్ రంజన్‌కుమార్ పాత్రొ, జిల్లా ఎస్‌డీసీ చైర్మన్ చంద్రశేఖర్ మాఝి పాల్గొన్నారు. నవరంగ్‌పూర్ పట్టణంలో దాదాపు ఐదేళ్ల అనంతరం వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ కమలోచన్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై, వైద్య రంగంలో సేవలందించిన కె.ధనుంజయ్ పట్నాయక్, సత్యసాయి సమితి కన్వీనర్ పి.లింగమూర్తిని సత్కరించారు. ఎస్‌డీసీ సలహాదారుడు ప్రదీప్ మాఝి, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, నవరంగ్‌పూర్ మున్సిపల్ చైర్మన్ కును నాయక్, మాజీ చైర్మన్ ప్రహ్లద త్రిపాఠి, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మంజులా మాఝి, మాజీ ఎమ్మెల్యే భుజబల్ మాఝి ప్రేక్షకుల మధ్య నుంచే కార్యక్రమాలను తిలకించారు. అకస్మాతుగా భారీ వర్షం కురవడంతో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.

సునాబెడాలో ఉగాది వేడుకలు
