
అంజలి మృతదేహం
మెరకముడిదాం: జిల్లాలోని మెరకముడిదాం మండలం గొల్లమర్రివలస గ్రామానికి చెందిన సాకేటి దుర్గాప్రసాద్, అంజలిలు మూడంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో విశాఖపట్నంలో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రామా రావు, కల్యాణి దంపతులు, వారి పిల్లలు దుర్గాప్రసాద్, కల్యాణిలతో కలిసి 11 ఏళ్ల క్రితం వలస వెళ్లి విశాఖపట్నంలో ఉంటున్నారు. రామారావు డాబర్ కంపెనీలో పనిచేస్తుండగా, కల్యాణి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. కుమారుడు దుర్గాప్రసాద్ ఇంటర్మీడియెట్, కుమార్తె అంజలి 10వ తరగతి చదువుతున్నారు. ఈ కుటుంబం నివాసముంటున్న భవనం అర్ధరాత్రి కుప్పకూలడంతో దుర్గాప్రసాద్, అంజలి అక్కడికక్కడే మృతిచెందారు. రామారావు, కల్యాణి తీవ్రంగా గాయపడడంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో ముని గిపోయారు. బాధితుల బంధువులు బుధవారం వేకువజామున విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.
మూడంతస్తుల భవనం
కూలిపోవడంతో ప్రమాదం