హోం క్వారంటైన్‌లో నాగాలాండ్ సీఎం

Nagaland CM Neiphiu Rio Goes Into Home Quarantine - Sakshi

కోహిమా : నాగాలాండ్ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ప‌నిచేసే  నలుగురు సిబ్బందికి కరోనా సోకడంతో సీఎం నీఫియు రియో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ముందుజాగ్రత్త చర్యగా ముఖ్య‌మంత్రితోపాటు సీఎం కార్యాలయ అధికారులు హోం క్వారంటైన్ లోకి వెళ్లామని నాగాలాండ్ సీఎంవో ట్వీట్ చేసింది.   కార్యాల‌య‌న్ని శానిటైజ్ చేసి 48 గంట‌ల పాటు మూసివేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా హోం క్వారంటైన్‌లో ఉన్న సీఎం ఇంటినుంచే ప‌నిచేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

ముఖ్య‌మంత్రితో పాటు కార్యాల‌యంలోని సిబ్బంది, అధికారులు స‌హా మొత్తం 53 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రాష్ర్టంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1566కు చేరింద‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి  ఎస్ పంగ్న్యు వెల్ల‌డించారు.  ఇప్ప‌టికే 625 మంది కోవిడ్ నుంచి కోలుకొన‌గా ప్ర‌స్తుతం 936 క‌రోనా యాక్టివ్ కేసులున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు  39.9 శాతంగా ఉంద‌న్న మంత్రి కిఫిరే జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేద‌ని అన్నారు. (ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top