
న్యూఢిల్లీ: ‘అది 1977, మార్చి 12.. దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తేసిన రోజు.. సరిగ్గా అదే రోజున నా యూపీఎస్‌సీ ఇంటర్బ్యూ జరిగింది’ అంటూ తన యూపీఎస్‌సీ జర్నీని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. నాడు తనకు జీవితంలో అగ్ని పరీక్ష ఎదురయ్యిందని న్యూఢిల్లీలో సంకల్ప్ ఫౌండేషన్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జైశంకర్ పేర్కొన్నారు. సివిల్ సర్వీసుల్లోకి ప్రవేశించిన కొత్త బ్యాచ్ సభ్యుల సమావేశంలో జైశంకర్ ప్రసంగించారు.
విదేశాంగ మంత్రి జైశంకర్ తన యూపీఎస్‌సీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, దేశంలో అత్యవసర పరిస్థితి రద్దు చేసిన రోజున తనకు యూపీఎస్‌సీ ఇంటర్య్యూ జరిగిందని తెలిపారు. నాడు తనకు జీవితంలో నిజమైన సవాలు ఎదురయ్యిదని అన్నారు. నాడు ఎమర్జెన్సీని రద్దుచేయడంతో షాజహాన్ రోడ్‌లో జరిగే ఇంటర్వ్యూ కు హాజరయ్యాను. ఆ రోజు ఇంటర్వ్యూకు హాజరైన తొలి వ్యక్తిని తానేనని ఆయన తెలిపారు. తాను రాజకీయ శాస్త్రం విద్యార్థిని కావడంతో 1977 ఎన్నికల గురించి తనను అడిగారన్నారు.
#WATCH | Delhi: "My interview (Civil Services) was on March 21, 1977. That was the day the Emergency was revoked. I go in for an interview at Shahjahan Road, the first person that morning..." says EAM Dr S Jaishankar at Guru Samman and felicitation programme for new entrants in… pic.twitter.com/g5QsmfmdM7
— ANI (@ANI) July 20, 2025
దీనిసమాధానం ఇస్తున్న తరుణంలో తాను ఇంటర్వ్యూలో ఉన్నాననే సంగతిని మరచిపోయి పలు విషయాలు తెలియజేశానని జైశంకర్ తెలిపారు. తాము 1977 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నామని, అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పనిచేశామని చెబుతూ, విద్యార్థిగా తనకు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యూ)తో ఉన్న అనుబంధాన్ని జైశంకర్ వివరించారు. కాగా విదేశాంగ కార్యదర్శిగా కూడా పనిచేసిన జైశంకర్.. ప్రభుత్వంతో ముడిపడిన పలు విషయాలను ప్రజలకు తెలియజేయడంలో ఎవరినీ నొప్పొంచకుండా వ్యవహరించడం చాలా కష్టమన్నారు.
మోదీ ప్రభుత్వం ఇటీవల అత్యవసర పరిస్థితికి 50 ఏళ్లు గడచిన తరుణాన్ని గుర్తుచేసుకుంటుంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1975, జూన్ 25న అత్యవసర పరిస్థితిని విధించారు. 1977 మార్చి 21న దానిని ఎత్తివేశారు.ఈ అత్యవసర పరిస్థితి తర్వాత జనతా పార్టీ 1977 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.