స్వతంత్ర భారతి: బాలలకు ఉచిత, నిర్బంధ విద్య | Azadi Ka Amrit Mahotsav Right To Free Educational Detention | Sakshi
Sakshi News home page

స్వతంత్ర భారతి: బాలలకు ఉచిత, నిర్బంధ విద్య

Published Wed, Aug 3 2022 6:28 PM | Last Updated on Wed, Aug 3 2022 6:28 PM

Azadi Ka Amrit Mahotsav Right To Free Educational Detention - Sakshi

2010 ఏప్రిల్‌ 1న ‘ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం –2009’ అమల్లోకి వచ్చింది. దేశంలో 6 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం ఈ చట్టం లక్ష్యం. భారత రాజ్యాంగంలోని 86 వ సవరణను అనుసరించి, ఆర్టికల్‌ 21–ఎ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని చెబుతోంది. స్వాతంత్య్రానికి ముందు మొదటిసారిగా 1882లో హంటర్‌ కమిషన్‌ ఉచిత విద్య ప్రాధాన్యం గురించి ప్రస్తావించింది. తర్వాత గోపాలకృష్ణ గోఖలే 1911లో దీని ప్రాముఖ్యాన్ని గుర్తించి, నాటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫలితం లభించలేదు.

స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్‌ 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత విద్యను అందించాలని పేర్కొంది. 2009 చట్టం కింద.. జనన ధ్రువీకరణ పత్రం లేదనే కారణంతో పాఠశాల ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ఏ విద్యార్థిని కూడా ఒక విద్యా సంవత్సరంలో ఏ తరగతిలోనూ ఒక సంవత్సరం కంటే ఎక్కువగా నిలిపి ఉంచకూడదు. ప్రాథమిక తరగతులకు ఎంపిక పరీక్ష నిర్వహించకూడదు. 

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు

  • జ్యోతి బసు, జానకీ వెంకట్రామన్, కె.కరుణాకరన్‌.. కన్నుమూత.
  • 2008 ముంబై పేలుళ్ల కేసులో అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్ష విధింపు.
  • జాతీయ గుర్తింపు పథకం ‘ఆధార్‌’ను ప్రవేశపెట్టిన భారత ప్రభుత్వం.
  • తొలి ఆధార్‌ కార్డు జారీ. 

(చదవండి: లక్ష్యం 2047)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement