‘ఈ వెయ్యి కోట్ల ప్రశ్నకు సమాధానం తెలుసా?’ | Sakshi
Sakshi News home page

‘ఈ వెయ్యి కోట్ల ప్రశ్నకు సమాధానం తెలుసా?’

Published Sun, Nov 15 2020 2:58 PM

Anand Mahindra Post About Perils Marriage - Sakshi

ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహేంద్ర సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చిన విషయాలను ట్విటర్‌ వేదికగా అందరితో పంచుకుంటూ ఉంటారు. తాజాగా చీమల పెళ్లికి సంబంధించి ట్విటర్‌లో ఓ పోస్టు చేశారు. ‘‘   ఇది చూసిన తర్వాత నవ్వి నవ్వి నా కడుపు ఇప్పటికి కూడా నొప్పితీస్తోంది. శ్రీ అముల్‌ భారతే అనే వ్యక్తి అడిగిన ఓ సాంకేతిక వివరణ ఇందుకు కారణం. నేను ఇప్పటి వరకు విన్న చీమల పెళ్లిళ్లకు సంబంధించిన పెద్ద జోక్‌ ఇదే ’’ అంటూ కామెంట్‌ చేశారు. ( భావోద్వేగ దృశ్యం: కన్నీళ్లు ఆగడం లేదు )

ఇంతకీ విషయం ఏంటంటే.. ఓ ఒంటరి చీమ 29 సంవత్సరాలు జీవిస్తుంది.. అని ఎవరో ఓ పోస్టు పెట్టారు. అముల్‌ భారతే అనే వ్యక్తి దానిపై కామెంట్‌ చేస్తూ.. మరి పెళ్లైన చీమ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంది? అని ప్రశ్నించారు. దీన్ని చదివిన ఆనంద్‌ మహేంద్ర పగలబడి నవ్వుకున్నారు. దీన్ని తన ఖాతాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్‌.. వేలల్లో కామెంట్లు, లైకులతో ముందుకు దూసుకుపోతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఈ వెయ్యి కోట్ల ప్రశ్నకు సమాధానం తెలుసా?... పెళ్లైన చీమలకు చావు ఉండదు.. ఎందుకంటే అవి ‍‍ప్రతి రోజు చస్తూ బ్రతుకుతుంటాయి... అది వాటి భాగస్వామి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది’’ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement