మందకొడిగా నామినేషన్లు
భూమి కబ్జా చేశారని..
కోర్టు ఆదేశించినా.. తమ పొలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ కుటుంబం పెట్రోల్ సీసాతో నిరసన తెలిపింది.
● రెండో రోజు సర్పంచ్‌కు 57, వార్డు స్థానాలకు 114 దాఖలు
వాతావరణం
అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతుంది. రాత్రిళ్లు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మంచు కురుస్తుంది.
–8లో u
మద్దూరు: జిల్లాలోని మద్దూరు, కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి మండలాల్లో రెండో రోజు శుక్రవారం కూడా నామినేషన్లు అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. మొదటి విడతగా ఎన్నికలు నిర్వహిస్తున్న పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే జిల్లాలోని ఆయా మండలాల్లో మొత్తం 67 సర్పంచ్, 572 వార్డు స్థానాలకు గాను రెండో రోజు సర్పంచ్‌కు 57, వార్డు స్థానాలకు 114 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
నేడే చివరి రోజు..
గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అధికంగా ఉండటంతో.. వారిని బుజ్జగించే పనిలో రాజకీయ పార్టీల నాయకులు పడ్డారు. దీంతోనే గురు, శుక్రవారాల్లో నామినేషన్లు ఊపందుకోలేదని తెలుస్తోంది. చాలా గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయా పార్టీల మద్దతుదారులకు రెబల్ బెడదను తప్పించడానికి గ్రామ పెద్దల సమక్షంలో మంతనాలు, బుజ్జగింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో చివరి రోజైన శనివారం నామినేషన్లు పెద్దఎత్తున దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి.
● మద్దూరు మండలం దోరేపల్లి పంచాయతీలో నామినేషన్ల ప్రక్రియను డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్ ఫణిరాజ్ పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్‌ఓలకు సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మందకొడిగా నామినేషన్లు


