టీ–పోల్ యాప్‌లో సమగ్ర సమాచారం
నారాయణపేట: టీ–పోల్ యాప్‌లో ఎన్నికల సమగ్ర సమాచారం పొందుపర్చడం జరిగిందని.. పంచాయతీ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల వివరాలతో పాటు ఓటరు స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకోవచ్చన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా లోని ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా.. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియాగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఎన్నికల నియమావళి పక్కాగా అమలు
నారాయణపేట: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియను శాంతి యుతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తిచేశామని ఎస్పీ డా.వినీత్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి అశాంతి, అవకతవకలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో 163 బీఎన్‌ఎస్ సెక్షన్ అమల్లో ఉండటంతో పాటు డీఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుందన్నారు. అనుమతి పొందిన అభ్యర్థులు, వారి సహాయకులకు మాత్రమే ప్రవేశముంటుందన్నారు. అనవసర గుంపులు, అతి ఉత్సాహ చర్యలపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా సరిహద్దులో ఏర్పాటుచేసిన 5 చెక్‌పోస్టుల వద్ద, ప్రధాన రహదారుల పై తనిఖీలను మరింత ముమ్మరం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న అన్ని లైసెన్స్ ఆయుధాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడంతో పాటు ట్రబుల్ మేకర్లు, రౌడీ షీటర్లు, కేడీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.
కార్మికుల వేతనాల్లో
కోత విధించొద్దు
కోస్గి రూరల్: కోస్గి సామాజిక ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల్లో కోత విధించడం సరైంది కాదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ అన్నారు. గురువారం స్థానిక సీహెచ్‌సీ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్మికుల వేతనాల్లో కోత విధించడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించకుండా అన్యాయానికి గురిచేస్తున్న సదరు ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు సంతోష్, కృష్ణ, అశోక్, వెంకటేశ్, సత్య ప్రకాష్, కిష్టమ్మ, శ్యామలమ్మ, నవీన లక్ష్మి, సులోచన, అనురాధ పాల్గొన్నారు.
టీ–పోల్ యాప్‌లో సమగ్ర సమాచారం


