ఇబ్బందులు లేకుండా వరిధాన్యం సేకరణ
నారాయణపేట టౌన్:రైతులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా వరిధాన్యం కొనుగో లు ప్రక్రియ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మె ప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేర కు ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టాలన్నారు. నాణ్యతా ప్రమాణాలకులోబడి ఉన్న ధాన్యాన్ని తూకం వేయడంలో అలసత్వం వహించొద్దని నిర్వాహకులకు సూచించారు. అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని తెలిపా రు. కమిషనర్ వెంట మెప్మా డీఎంసీ శివకుమార్ తదితరులు ఉన్నారు.


