ఇసుక అక్రమ రవాణా చేస్తే చూస్తు ఊరుకోం
● మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
● ఇసుక టిప్పర్ల అడ్డగింత
మాగనూర్: మండల కేంద్రంలోని పెద్దవాగు నుంచి మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చూస్తు ఊరుకోమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పెద్దవాగు సమీపంలో ఇసుకలోడ్‌తో వస్తున్న టిప్పర్‌ను అడ్డుకుని టైర్లకు గాలి తీయించారు. అనంతరం మాట్లాడుతూ.. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు లేవన్నారు. తాను స్వయంగా హైకోర్టు నుంచి వచ్చిన స్టే ఆర్డర్‌ను సంబంధిత కలెక్టర్, తహసీల్దార్‌తో పాటు పోలీస్ అధికారులకు సైతం అందించామన్నారు. అయినా ఇక్కడ ఇసుక అక్రమ రవాణా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడి వనరులు స్థానికులకే చెందాలని డిమాండ్ చేశారు. బుధవారం వాగు నుంచి తరలిస్తున్న ఇసుకకు సంబంధించిన అనుమతులను కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని సంప్రదించగా.. అనుమతులు లేవని తెలిపినట్లు మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను టిప్పర్లతో తరలిస్తున్నా మండల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవ డం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు అంతా కలిసి మాజీ ఎమ్మెల్యేకు మద్దతుగా ఒక ఇసు క టిప్పర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే రెండు గంటలు కూడా గడవక ముందే టిప్పర్ పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చేయడంతో అందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. ఇదే విషయంపై స్థానిక ఎస్‌ఐ పి.అశోక్‌బాబును సంప్రదించగా అ నుమతి పత్రాలు సంబంధిత కాంట్రాక్టర్ చూయించడంతో టిప్పర్‌ను వదిలేశామని తెలిపారు.


