పరీక్ష బాగా రాశాను..
‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్‌బీ పరీక్షలో స్పెల్లింగ్స్, గ్రామర్ తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. గతంలో ఇచ్చిన మెటీరియల్‌ను ప్రిపేర్ కావడం వల్ల చాలా సులభంగా ప్రశ్నలకు జవాబులు రాశా. గతంలో కూడా నేను స్పెల్‌బీ పరీక్ష రాయడం వల్ల ఇంగ్లిష్‌పై చాలా వరకు అవగాహన పెంచుకున్నా. కాన్పిడెన్స్‌గా ప్రశ్నలకు జ వాబులు రాశాను.
– వసుంధర, 9వ తరగతి,
మౌంట్‌బాసిల్ స్కూల్, మహబూబ్‌నగర్
గణితంపై పట్టు సాధించేలా..
మొదటిసారిగా పాఠశాలలో నిర్వహించే పరీక్షలు కాకుండా ఓ పోటీ పరీక్ష రాశాను. ఈ పరీక్షలో అందరికంటే ఎక్కు వ మార్కులు తెచ్చుకోవాలని ప్రయత్నించా. చాలా సులభంగా జవాబులు రాసే విధంగా ప్రశ్నపత్రం వచ్చింది. భవిష్యత్‌లో మ్యాథ్స్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు మ్యాథ్స్‌బీ పరీక్ష ఎంతగానో దోహదపడుతుంది.
– సాయిహర్షిత, 9వ తరగతి,
మౌంట్‌బాసిల్ స్కూల్, మహబూబ్‌నగర్
పరీక్ష బాగా రాశాను..


