స్పెల్‌బీ.. మ్యాథ్స్‌బీకి విశేష స్పందన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని మౌంట్‌బాసిల్ పాఠశాలలో ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలకు విశేష స్పందన లభించింది. మెయిన్ స్పాన్సర్స్ డ్యూక్ వఫే, అసోసియేషన్ విత్ ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమండ్రి వారి సౌజన్యంతో నిర్వహించిన పరీక్షలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పరీక్షలు రాయడంతో తమకు ఇంగ్లిష్‌పై అవగాహన పెరిగిందని పలువురు విద్యార్థులు తెలిపారు. ముందుగానే వివిధ అంశాలను నేర్చుకోవడం వల్ల సులభంగా పరీక్ష రాసినట్లు చెప్పారు. వివిధ స్థాయిల్లో పరీక్షలు రాయడం వల్ల పోటీ పరీక్షలకు సైతం సులభంగా ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరు
పరీక్షలో కఠినమైన ప్రశ్నలకు సైతం సులభంగా జవాబులు రాశామన్న విద్యార్థులు
స్పెల్‌బీ.. మ్యాథ్స్‌బీకి విశేష స్పందన
స్పెల్‌బీ.. మ్యాథ్స్‌బీకి విశేష స్పందన
స్పెల్‌బీ.. మ్యాథ్స్‌బీకి విశేష స్పందన


