టెండర్ ఫీజు తగ్గించినా స్పందన కరువు
దేవరకద్ర రూరల్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చిన్నరాజమూర్ ఆంజనేయస్వామికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. స్వామివారి ఉత్సవాలకు రాష్ట్రం నుంచేగాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు. నెలరోజుల పాటు కొనసాగే స్వామివారి ఉత్సవాల్లో ప్రసాద విక్రయానికిగాను అధికారులు రెండుసార్లు బహిరంగ వేలం నిర్వహించినా ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. వచ్చే నెల 2 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. ప్రసాద విక్రయ టెండర్‌పై మాత్రం పీటముడి వీడటం లేదు.
● ఉత్సవాల సమయంలో స్వామివారిని లక్ష మందికిపైగా భక్తులు దర్శించుకుంటారు. గతంలో ప్రసాదాల పంపిణీ ఆలయం తరుఫున కొనసాగుతుండగా.. ఎక్కువ ఆదాయం సమకూరేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకోసం ముందుగా రూ.2 లక్షల డిపాజిట్ రుసుంతో వేలం నిర్వహించగా, స్పందన రాలేదు. దీంతో డిపాజిట్ ఫీజును రూ.లక్ష తగ్గించి మరోసారి టెండరు పిలిచారు. అయినప్పటికీ టెండరు దాఖలుకు ఎవరూ ముందుకురాకపోవడంతో గత్యంతరం లేక వాయిదా వేశారు. బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న వేళ అధికారులు మరోసారి టెండర్ పిలుస్తారా.. లేక పాత పద్ధతిలోనే కొనసాగిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.
గ్రామస్తులే దక్కించుకున్నారు..
ఆలయ పరిధిలో జరిగే టెంకాయలు, తలనీలల సేకరణ, కొబ్బరి చిప్పల సేకరణకు అధికారులు నెలరోజుల కిందట బహిరంగ వేలం నిర్వహించారు. మూడు టెండర్లలో బయటి వ్యక్తులు పాల్గొనకున్నా.. గతం కంటే కొంచెం ఎక్కువ పాడి గ్రామస్తులే దక్కించుకున్నారు. టెంకాయల టెండర్‌ను రూ.2.76 లక్షలకు గోవర్ధన్, తలనీలల సేకరణను రూ.4.91 లక్షలకు వన్నాడ గోపాల్, కొబ్బరి చిప్పల సేకరణను రూ.90 వేలకు కుర్మయ్య దక్కించుకున్నారు.
చిన్నరాజమూర్‌లో ప్రసాదాల విక్ర య టెండర్ వాయిదా
రూ.లక్ష తగ్గించిన అధికారులు
డిసెంబర్ 2 నుంచి జాతర ప్రారంభం
టెండర్ ఫీజు తగ్గించినా స్పందన కరువు


