అపురూప జైన శిల్పాలు లభ్యం
● చాళుక్య, కాకతీయుల కాలం నాటివిగా గుర్తింపు
● జైన విద్యా కేంద్రం ఉన్నట్లుగా ఆనవాళ్లు
వీపనగండ్ల: మండల పరిధిలోని తూముకుంట గ్రామ శివాలయ ప్రాంగణంలో పురాతన జైన శిల్పాలు లభించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రతినిధులు బైన్‌రోజు చంద్రశేఖర్, డా.బైరోజు శ్యాంసుందర్ ఆదివారం తెలిపారు. శిల్పాల్లో జైన తీర్థంకరుడు, వర్ధమాన మహావీరుడు, ధ్యాన సంసిద్ధుడై ఉండగా అతని తలపై మూడు వరుసలలో గొడుగు, ఇరువైపుల ఛామరాలు చెక్కబడి ఉన్నాయన్నారు. శిల్పం కింది అంతస్తులో జ్ఞాన పీఠానికి రెండు వైపులా ఇద్దరు శ్రామికులు కూర్చొని ఉన్నారన్నారు. ఈ విగ్రహాలను పుస్తకదక్ష్చ లేదా సరస్వతీగక్ష్చ అంటారన్నారు. వీటి ఆధారంగా తూముకుంటలో జైన విద్యా కేంద్రం ఉండేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొరన్నారు. విగ్రహాల్లో చెప్పదగినవి.. గండపెండేరం సాధారణ వీరుడుకి ఉందని, ఒక విగ్రహం చాళుక్యుల కాలం, మరోక విగ్రహం కాకతీయుల కాలానికి చెందిందన్నారు. గ్రామానికి సమీపంలో సింగోరం గుట్టపై పది అడుగుల పైగా ఉన్న సుపార్శనాథుడి విగ్రహం కూడా లభించిందని పేర్కొన్నారు. ఇట్టి విగ్రహాలను ముందు తరాల వారు గుర్తుంచుకునే విధంగా భద్రపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అపురూప జైన శిల్పాలు లభ్యం


