ఆటోను ఢీకొట్టిన కారు
మహబూబ్‌నగర్ క్రైం: కారు డ్రైవర్ అతివేగంగా ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో బాలుడితో పాటు మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వన్‌టౌన్ ఎస్‌ఐ శీనయ్య కథనం ప్రకారం.. ధన్వాడ మండలం ఆకుమర్రితండాకు చెందిన శ్రీను అనే ఆటో డ్రైవర్ ఆదివారం కుటుంబంతో కలిసి ఫతేపూర్ మైసమ్మకు మొక్కులు చెల్లించి మహబూబ్‌నగర్ నుంచి కోయిలకొండ వైపు వెళ్తుండగా, కోయిలకొండ వైపు నుంచి మహబూబ్‌నగర్‌కు వస్తున్న కారు కోయిలకొండ ఎక్స్‌రోడ్ సమీపంలో ఆటోను ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న శక్రిబాయి, కవిత, ఏడేళ్ల అఖిల్ అనే బాలుడికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ముగ్గురికి గాయాలు
ఆటోను ఢీకొట్టిన కారు


