ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి
మాగనూర్: మండలంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని హౌసింగ్ పీడీ శంకర్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని వడ్వాట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసి, మార్కింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో భాగంగా బేస్‌మెంట్ లెవల్ పనులు పూర్తయిన వెంటనే తొలి విడత బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవికుమార్, హౌసింగ్ ఏఈ అంజనేయులు, మాజీ సర్పంచ్ రవీందర్, రాఘవరెడ్డి, బుక్క రాములు, కళ్యాణి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
‘విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు’
నారాయణపేట: రూరల్: విద్యారంగ సమస్యల సాధనకు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పీడీఎస్‌యూ మూడో జిల్లా మహాసభలను విజయవంతం చేద్దామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించినా విద్యారంగంలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. పేద విద్యార్థులకు రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందడం లేదని, మధ్యాహ్న భోజనంలోనూ నాణ్యత లోపించిందని విమర్శించారు. విద్యా రంగానికి సరైన బడ్జెట్ కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వాపోయారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉంచడం సరికాదన్నారు.
రెండు రోజుల పాటు సభలు..
విద్యారంగ సమస్యలను సమీక్షించేందుకు ఈ నెల 22, 23 తేదీల్లో మహాసభలను ఏర్పాటు చేస్తున్నామని సాయికుమార్ అన్నారు. ముఖ్య అతిథులుగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పీవైఎల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు హన్మేష్, సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వీ, అనిల్, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నగేష్ పాల్గొంటారని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు అజయ్, గౌస్, వెంకటేష్, మహేష్, రాజు, సురేష్ పాల్గొన్నారు.
నేటినుంచి డిగ్రీ పరీక్షలు
● ఉమ్మడి జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలు
● హాజరుకానున్న 34,066 మంది విద్యార్థులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న డిగ్రీ విద్యార్థులకు శనివారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సెమిస్టర్ 1, 3, 5కు సంబంధించి బీఏ, బీకాం, బీఎస్సీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు జరగనున్నాయి. సెమిస్టర్–1లో 18,966 మంది, సెమిస్టర్–5లో 8,100, సెమిస్టర్–3లో 7000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో ఎలాంటి కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సిట్టిండ్ స్క్వాడ్‌తో పాటు ఫ్లయింగ్‌స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.
ఫిర్యాదులు పరిశీలించి
పరిష్కరిస్తాం
స్టేషన్ మహబూబ్‌నగర్: డయల్ యువర్ ఆర్టీసీ ఆర్‌ఎంకు వచ్చిన సలహాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ అన్నారు. డయల్ యువర్ ఆర్‌ఎం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రీజినల్ పరిధిలోని ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఆర్‌ఎం సలహాలు, ఫిర్యాదులను స్వీకరించారు. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ రూట్లో శంకరాయపల్లి వద్ద బస్సులు, మహబూబ్‌నగర్‌లోని భగీరథకాలనీ వద్ద బస్సులు ఆపాలని ప్రయాణికులు ఫోన్‌లో కోరారు. ఉదయం సమయంలో కోస్గి నుంచి మహబూబ్‌నగర్ మీదుగా లింగచేడ్, కొమ్ము రు, కోయిలకొండకు బస్సులు నడపాలని, గద్వాల బస్సును అల్లపాడు నుంచి మానవపా డు ఎక్స్‌రోడ్ వరకు పొడిగించాలని కోరారు. కొల్లాపూర్ నుంచి శ్రీశైలం వరకు నేరుగా బస్సు సర్వీసు నడపాలని విజ్ఞప్తి చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి


