యాంటీ డ్రగ్ సైనికులుగా యువత పనిచేయాలి
నారాయణపేట రూరల్: యువత యాంటీ డ్రగ్ సైనికులుగా పనిచేసి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ వినీత్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో కళాశాల విద్యార్థులకు శుక్రవారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్ రహిత సమాజమే మన అందరి లక్ష్యంగా పని చేయాలన్నారు. నార్కోటిక్ డ్రగ్ అనేది ఒక టెర్రరిస్ట్ లాంటిదన్నారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందనని, సమస్యను నిర్మూలించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయం, వినియోగం చేస్తూ కనిపించినట్లయితే 1908 టోల్ ఫ్రీ నంబర్ లేదా డయల్ 100 కు వెంటనే సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్, సీఐ శివశంకర్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సునీత, ఆయా సంఘాల ప్రతినిధులు కన్న శివకుమార్, వడ్ల శ్రవణ్, మురళిబట్టడ్, నరేష్, వెంకటరమణ, వెంకటేష్, ఆకాశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
డ్రగ్స్, గంజాయి నివారించాలి
నారాయణపేట టౌన్: మహబూబ్‌నగర్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధాకర్ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు చట్టం అమలు మరింత బలోపేతం చేయాలని కోరారు. పోలీస్, ఎకై ్సజ్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమన్నారు.


