ప్రజలకు అండగా ఉంటా: మంత్రి వాకిటి
మక్తల్: నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలోనే కాకుండా జీవనోపాధికి ఎక్కడికి వెళ్లిన వారి ఇబ్బందులు తీర్చేందుకు అండగా ఉంటానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యసహకార, క్రీడల యువజన, పాడిపరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ నుంచి వెళ్లి హైదరాబాద్‌లో టూవీలర్‌పై పండ్లు, ఇతర వ్యాపారం చేసుకుంటున్న వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురువారం రాత్రి మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి చిరు వ్యాపారం చేసుకునే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే తనను సంప్రదించాలని, ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు.


