ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్‌

Nov 21 2025 10:49 AM | Updated on Nov 21 2025 10:49 AM

ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్‌

ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్‌

ఒక్కో నంబర్‌కు రూ.లక్షలు

ఆదాయం పెరుగుతుంది

రూ.లక్షల్లో డిమాండ్‌ ఉన్నా చెల్లించేందుకు రెడీ

ముందస్తు రిజర్వేషన్‌

ఫీజు పెంపు

పాలమూరు: ఇటీవల కాలంలో ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం ఒక ఎత్తు అయితే.. అంతకంటే ఎక్కువగా ఫ్యాన్సీ, లక్కీ నంబర్‌ తీసుకోవడానికి ఎంతైన ఖర్చు చేసే సంప్రదాయం బాగా పెరిగింది. చాలా వరకు కార్లకు, బైక్‌లకు ఫ్యాన్సీ నంబర్‌ పెట్టుకోవడం హోదాగా భావిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రత్యేక నంబర్లకు అధిక ప్రాముఖ్యత చోటుచేసుకుంటుంది. ఏడాది జనవరి నుంచి నవంబర్‌ 19వరకు జిల్లాలో 5,516 వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం జరిగింది. ఈ లక్కీ నంబర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.3.30 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఇందులో అధికంగా 9999తో పాటు 9, 7777, 7 సిరీస్‌, 01తో పాటు 7, 6, 5 వంటి సిరీస్‌ నంబర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

వాణా శాఖలో నూతన వాహనాల నంబర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ముందే రిజర్వేషన్‌ చేసుకునే ముఖ్యమైన నంబర్ల ఫీజు పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్‌ ఆర్టీఏ కార్యాలయంలో 9999 నంబర్‌ రిజర్వేషన్‌ చేసుకోవాలంటే సదరు వాహనదారుడు ముందుకు రూ.1.50 లక్షలు డీడీ చెల్లించి రిజర్వేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా వాహనదారుడు పోటీ వచ్చి వేలం పాట నిర్వహిస్తే మళ్లీ ఫీజు ధర పెరుగుతుంది. అదేవిధంగా 1, 9, 6666 నంబర్లకు ఫీజు రూ.లక్ష ఫీజు కేటాయించగా 99, 999, 3333, 4444, 5555, 7777 నంబర్లకు ఫీజు రూ.50వేలుగా నిర్ణయించారు. దీంతోపాటు 5, 6, 7, 123, 333, 369, 555, 666, 777, 1111 నంబర్లకు రూ.40వేలుగా ఫీజు కేటాయించారు. ఇకపై జాబితాలో లేని నంబర్లకు కారు నంబర్‌కు అయితే రూ.6వేలు, ద్విచక్ర వాహనం అయితే రూ.3వేల ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఆరోజు అందుబాటులో ఉండి రిజర్వ్‌ కాని నంబర్లకు రూ.2వేల ఫీజు చెల్లించి నంబర్‌ తీసుకోవచ్చు. పెరిగిన నంబర్ల ఫీజు వల్ల ఆర్టీఏ శాఖకు ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

ఆసక్తి చూపుతున్న వాహనదారులు

ఉమ్మడి జిల్లాలో ఏడాదిలో 5,516 వాహనాల రిజిస్ట్రేషన్‌

ప్రభుత్వానికి రూ.3.30 కోట్ల ఆదాయం

పాలమూరు ఆర్టీఏ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఓ రిజిస్ట్రేషన్‌లో వాహనదారుడు టీజీ 06బీ 0009 నంబర్‌ కోసం వేలం పాటలో రూ.7.75 లక్షలు పలికి నంబర్‌ సొంతం చేసుకున్నాడు. దీనిని బట్టి చూస్తే ఫ్యాన్సీ నంబర్లకు ఎంత డిమాండ్‌ ఉందో అర్థమవుతుంది. మరో వాహనదారుడు టీజీ06బీ0999 నంబర్‌ కోసం వేలం పాట ద్వారా రూ.1,05,500 ఖర్చు చేసి సొంతం చేసుకున్నాడు. టీజీ 06బీ5555 నంబర్‌ను రూ.1.34 లక్షలకు దక్కించుకున్నాడు.

ఫ్యాన్సీ, లక్కీ నంబర్లతో పాటు తాత్కాలిక రిజర్వేషన్‌ పద్ధతిలో జరిగే రిజిస్ట్రేషన్స్‌ ద్వారా ఆదాయం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం పెరిగిన ఫీజుల ధరల వల్ల రెవెన్యూ ఎలా ఉంటుంది అనే విషయం ప్రస్తుత సిరీస్‌ పూర్తి అయితే తెలుస్తోంది. ఫ్యాన్సీ నంబర్‌ తప్పక ఏర్పాటు చేసుకోవాలనే వారు కొంత మేర పెరుగుతున్నారు.

– కిషన్‌, డీటీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement