ఆస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై సమీక్ష
నారాయణపేట టౌన్: జిల్లాలోని ‘వాటర్ బడ్జెటింగ్ ఇన్ ఆస్పిరేషన్ బ్లాక్స్’ పరిధిలోని నర్వ మండలంలో వివిధ విభాగాల ప్రగతిపై గురువారం నీతి అయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నీతి అయోగ్ సీఈఓ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి అయోగ్ అదనపు కార్యదర్శి రోహిత్‌కుమార్ హాజరుకాగా, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా 47వ కార్యదర్శుల సాధికరత సమావేశం నర్వ బ్లాక్ ఇన్నోవేషన్ కేటగిరి ప్రాజెక్ట్ ప్రతిపాదనల గురించి వీసీలో చర్చించారు. నర్వ బ్లాక్‌లో ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య, ఉద్యానవన, పశువైద్య విభాగాల్లో 12 ప్రతిపాదనలు సమర్పించగా.. విద్యారంగం నుంచి స్పార్క్ స్కూల్ ప్రోగ్రాం ఫర్ ఏఐ రెడినెస్ అండ్ నాలెడ్జ్, శ్రీ పునరుత్పాదక మరియు పర్యావరణ అనుకూల ఆహారం కోసం సోలార్ (నర్వ కేజీబీవీ లో సౌర శక్తితో పని చేసే వంట గది) కోసం మొత్తం 1.2 కోట్లు మంజూరు చేశారు. అనంతరం కలెక్టర్ శిక్తా పట్నాయక్ ప్రాజెక్ట్ పూర్తి వివరాలను వెల్లడించారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్‌గంగ్వార్, డీఈఓ గో విందరాజులు, సమన్వయకర్త బాలాజీ ఉన్నారు.


