రూ.60 లక్షలు రావాలి..
కానుకుర్తి రిజర్వాయర్ నిర్మాణంలో 3 ఎకరాల భూమి కోల్పోతున్నా. ఎకరాకు రూ.20 లక్షల చొప్పున చెల్లిస్తామంటూ ప్రభుత్వ యంత్రాంగం ఒప్పంద పత్రాలు తీసుకొని రెండు నెలలు కావస్తోంది. ఇంతవరకు పరిహారం చెల్లించలేదు.. ఎప్పుడిస్తారని ఎదురుచూస్తున్నా. ఇప్పటికే భూముల ధరలు పెరిగాయి.. డబ్బులు వచ్చేసరికి దొరకని పరిస్థితి ఉంది.
– పల్లెర్ల అశోక్‌గౌడ్, భూ నిర్వాసితుడు, కానుకుర్తి (దామరగిద్ద)
పరిహారం చెల్లించాలి..
ముంపునకు గురవుతున్న మా భూములకు ఎకరాకు రూ.20 లక్షలు నష్టపరిహారం ఇస్తామని అధికారులు హడావుడిగా ఒప్పంద పత్రాలు తీసుకున్నారు. చెల్లింపులపై ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదు. వెంటనే డబ్బులు చెల్లించి ఆదుకోవాలి. – మాల నర్సిములు,
భూ నిర్వాసితుడు, కాట్రేవుపల్లి (మక్తల్)
త్వరలోనే తీపికబురు..
పేట–కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో రైతులు స్వచ్ఛందంగా ఒప్పంద పత్రాలు రాసిచ్చారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. త్వరలోనే భూ నిర్వాసితులకు తీపికబురు అందనుంది.
– రాంచందర్‌నాయక్, ఆర్డీఓ, నారాయణపేట
●
రూ.60 లక్షలు రావాలి..
రూ.60 లక్షలు రావాలి..


