రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
కోస్గి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ సూచించారు. బుధవారం మండలంలోని చెన్నారం గ్రామంలో బంగినపల్లి ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలంటే కనీస ప్రమాణాలు పాటించాలన్నారు. తేమశాతం 17 శాతం ఉండేలా చూసుకొని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కేంద్రాల నిర్వాహకులు సైతం రైతులకు నష్టం కలగకుండా నిబంధనల మేరకు ధాన్యం తీసుకోవాలని సూచించారు. అనంతరం కొనుగోలు కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఏఓ రామకృష్ణ, ఏఈఓలు, ఎఫ్‌పీఓ చైర్మన్ వెంకట్‌రెడ్డి, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.


