క్రీడలతో పోటీతత్వం
నారాయణపేట రూరల్: క్రీడలతో విద్యార్థుల మధ్య పోటీతత్వం పెరగడంతో పాటు స్నేహభావం అలవడుతుందని డీఈఓ గోవిందరాజులు అన్నారు. నారాయణపేట మండలం సింగారం చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్ జిల్లాస్థాయి అండర్–17 విభాగలో ఖోఖో పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా.. మైదానంలో క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. ఆటలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, పీడీలు అనంతసేన, కథలప్ప, సాయినాథ్, రవికుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు.


