సివిల్ కోర్టునుఅందుబాటులోకి తేవాలి
మక్తల్: నియోజకవర్గ కేంద్రంలో సివిల్ కోర్టును అందుబాటులోకి తేవాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం మక్తల్‌కు చెందిన న్యాయవాదుల బృందం రాష్ట్ర సచివాలయంలో మంత్రితో పాటు న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డిని కలిసి సివిల్ కోర్టును ప్రారంభించాలని విన్నవించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఇప్పటికే కోర్టు భవనాన్ని పునరుద్ధరించడం జరిగిందని, ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అదే విధంగా హైకోర్టు పోర్ట్ ఫోలియో జడ్జి అనిల్‌కుమార్‌ను నారాయణపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్, న్యాయవాదులు నాగురావు నామాజీ, నందు నామాజీ, చెన్నారెడ్డి తదితరులు కలిసి మక్తల్‌లో సివిల్ కోర్టు భవనాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశా రు. కార్యక్రమంలో న్యాయవాదులు దత్తాత్రే య, ఆనంద్, ప్రకాశ్, సురేందర్, రామ్మోహన్, సూర్యనారాయణ, మోహన్‌యాదవ్ తదిత రులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు
రానివ్వొద్దు
మక్తల్: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వొద్దని డీఆర్డీఓ మొగులప్ప అన్నారు. మంగళవారం మక్తల్ మండలం గుడిగండ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డీఆర్డీఓ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. నిబంధనల మేరకు తేమశాతం ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలుచేసి.. మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఏఈఓ కిరణ్మయి, జయమ్మ, లలితమ్మ, జనార్దన్, శంకర్ ఉన్నారు.
సివిల్ కోర్టునుఅందుబాటులోకి తేవాలి


