వందశాతంఫలితాలు సాధించాలి
నారాయణపేట రూరల్: పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ట్రెయినీ కలెక్టర్ వి.పాణిరాజ్ సూచించారు. సోమవారం మండలంలోని జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రార్థనా సమయంలోనే సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ తెలుసుకున్నారు. విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం, లెక్కింపు నైపుణ్యం పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. రివిజన్ టెస్టుల్లో విద్యార్థులు చేసిన తప్పిదాలను తెలియజేసి.. వాటిని సరిచేయాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట సీఎంఓ రాజేంద్రకుమార్, మిడ్ డే మిల్స్ జిల్లా ఇన్‌చార్జి యాదయ్యశెట్టి, డీఎస్‌ఓ భాను ప్రకాశ్, హెచ్‌ఎం భారతి ఉన్నారు.
పదోన్నతితోమరింత బాధ్యత
నారాయణపేట: పదోన్నతి విధి నిర్వహణలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు మరింత బాధ్యతను పెంచుతుందని ఎస్పీ డా.వినీత్ అన్నారు. జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన శ్రీనివాసులుకు ఎస్పీ పట్టీలు తొడిగి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రియాజ్ హూల్ హక్ పాల్గొన్నారు.
16 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏడీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ నగరంతో పాటు, జడ్చర్ల, గద్వాల పట్టణంలో, వనపర్తిలో ఉన్న దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లఘించిన 16 మెడికల్ దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదనపు ధరలతో పాటు స్టాక్ రిజిస్టర్లు, బిల్లింగ్ రికార్డులు షెడ్యూల్, హెచ్1 రిజిస్టర్లు, డ్రగ్ లైసెన్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ ప్రతి దుకాణంలో డ్రగ్స్ కొనుగోలు అమ్మకాలు, నిల్వ చేసే విధానం సక్రమంగా ఉండాలని, ప్రిస్క్రిప్షన్ ద్వారానే మందుల విక్రయాలు జరగాలని, రిజిస్టర్ ఫార్మాసిస్ట్ సమక్షంలో విక్రయాలు జరగాలన్నారు. తనిఖీల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు రఫీ, రష్మి, విశ్వంత్‌రెడ్డి, వినయ్ పాల్గొన్నారు.
వందశాతంఫలితాలు సాధించాలి
వందశాతంఫలితాలు సాధించాలి


