దిక్కుతోచడం లేదు..
రెండ్రోజుల కిందనే స్లాట్ బుక్‌చేసుకొని లింగంపల్లి శివారులోని వినాయక కాటన్ మిల్లు దగ్గర పత్తిని ట్రాక్టర్‌లో తీసుకొస్తే క్యూలైన్‌లో నిలబెట్టారు. ఇప్పుడు కాటన్‌మిల్లు బంద్ అని చెప్పడంతో దిక్కుతోచడం లేదు. స్లాట్ క్యాన్సల్ చేసుకొని మళ్లీ బుక్ చేసుకుంటే ఆ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు.
– దేవర రాము, లింగంపల్లి, మక్తల్ మండలం, నారాయణపేట జిల్లా
ఆందోళనలు చేస్తాం..
లింగంపల్లి పత్తి మిల్లు దగ్గర మూడు రోజుల నుంచి ట్రాక్టర్లు అద్దెకి తీసుకొని క్యూలో నిలబడి ఉన్నాం. సోమవారం కొనుగోలు చేసేది ఉండే.. తీరా బంద్ అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. అధికారుల స్పందించి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలి. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.
– లక్ష్మణ్, పత్తిరైతు, మల్లేపల్లి
20 క్వింటాళ్లు తెచ్చా..
20 క్వింటాళ్ల పత్తిని సోమవారానికి స్లాట్ బుక్‌చేసుకొని వడ్వాట్ సమీపంలోని కాటన్ మిల్లుకు తీసుకొచ్చా. ఇక్కడికి వచ్చాక బంద్ అని చెప్పిండ్రు. ఇది ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియదు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలి.
– కిష్టప్ప, పత్తిరైతు, వడ్వాట్ గ్రామం, మాగనూరు మండలం, నారాయణపేట జిల్లా
రెండ్రోజులుగా ఇక్కడే ఉన్నాం..
దేవరకద్ర మండలం నుంచి మిడ్జిల్ మండలంలోని రాణిపేట శివారులోని సీసీఐ కేంద్రానికి ఆదివారం సాయంత్రం పత్తిని బొలెరో వాహనంలో తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చాక బంద్ ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. రోజురోజుకూ బండి కిరాయి పెరుగుతుంది. ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను తీర్చాలి.
– ఆనంద్, పత్తి రైతు, అమ్మాపూర్, దేవరకద్ర మండలం
●
దిక్కుతోచడం లేదు..
దిక్కుతోచడం లేదు..
దిక్కుతోచడం లేదు..


