ఉత్సాహంగా సదర్ ఉత్సవాలు
కోస్గి పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం కురుమ యాదవ
సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
దున్నపోతుల విన్యాసాలు అందరినీ అలరించాయి. ముందుగా వేణుగోపాలస్వామి ఆలయం నుంచి శివాజీ చౌరస్తా వరకు దున్నపోతులతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో యాదవ
సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పిరంపల్లి శ్రీనివాస్, నాయకులు వెంకటేశ్, నర్సింహులు,
హన్మంతు, భాస్కర్, రమేశ్ పాల్గొన్నారు. – కోస్గి రూరల్


