జలవనరుల లెక్క పక్కా
మద్దూరు: జిల్లాలోని చిన్న నీటివనరుల లెక్కింపునకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఐదేళ్లకోసారి జిల్లాల వారీగా గొట్టపుబావులు, ఓపెన్ బావులు, చెరువులు, చిన్నపాటి కుంటలు, 2వేల హెక్టార్లలోపు భూమికి సాగునీరు అందించే మినీ ప్రాజెక్టుల గణన చేపడుతున్నారు. వాటన్నింటి వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి అందిస్తారు. ఈ గణన ద్వారా ఏయే గ్రామంలో ఎన్ని నీటివనరులు ఉన్నాయనే వివరాలతో పాటు గ్రామాల్లో నీటి లభ్యత ఎలా ఉందనే అంశం వెలుగులోకి రానుంది. అధికారులు అందించిన ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం భవిష్యత్‌లో రాష్ట్ర నీటివనరుల రంగానికి వివిధ స్కీంల కింద ఆర్థిక సహకారం అందించనుంది. అయితే ఈ వారంలోనే నీటివనరుల గణన మొదలుకానుంది. మ్యానువల్ పద్ధతిలో నీటి వనరులను లెక్కపెట్టి.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేయనున్నారు.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి..
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలశక్తి అభియాన్‌లో భాగంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి చిన్న నీటివనరులను లెక్కిస్తారు. చివరకు 2017–18లో నీటివనరుల గణన నిర్వహించారు. అప్పట్లో జిల్లావ్యాప్తంగా బావులు, బోరుబావులు, గొట్టపు బావులు 30,506, చెరువులు, కుంటలు, వాగులు, చెక్‌డ్యాంలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తదితరాలు 2,142 ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఐదేళ్ల తర్వాత చేపట్టనున్న నీటివనరుల గణను పకడ్బదీగా చేపట్టేందుకు సీపీఓ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమక్షంలో ఈ నెల 12న ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జిల్లాలో నీటివనరుల గణన పక్కాగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
సిబ్బందికి శిక్షణ..
జిల్లాలో చిన్న నీటివనరుల గణన కోసం కేటాయించిన సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. సీపీఓ కార్యాలయ అధికారులతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సైతం సర్వే ప్రక్రియను పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటుచేశారు. కలెక్టర్ చైర్మన్‌గా, సీపీఓ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. గ్రామ పరిపాలన అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు చిన్న నీటివనరుల గణన చేపట్టనున్నారు. వీరికి సమన్వయంచేసే బాధ్యతలను మండలాల వారీగా తహసీల్దార్లకు అప్పగించనున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్వహించే నీటివనరుల గణన వివరాలను రోజు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అనంతరం వాటిని ఉన్నతాధికారులకు నివేదించనున్నారు.
కాంచనగుహకు భక్తులు
కురుమూర్తిస్వామి జాతరకు భక్తులు భారీగా తరలిరావడంతో మైదానమంతా రద్దీగా మారింది.
–8లో u
జలవనరుల లెక్క పక్కా


