న్యాయవాదుల విధుల బహిష్కరణ
నారాయణపేట టౌన్/ కోస్గి రూరల్: నిర్మల్ జిల్లా కోర్టులో న్యాయవాదిపై కానిస్టేబుల్ దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం నారాయణపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విఽధులు బహిష్కరించారు. ఇప్పటికై నా ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది అశోక్‌పై దాడి చేసిన కానిస్టేబుల్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. బార్ అసోషియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, ఉపాధ్యక్షుడు నందు నామాజీ, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రక్షణ చట్టాన్ని అమలు చేయాలి
న్యాయవాదులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోస్గి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గందె ఓం ప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మల్ న్యాయస్థానంలో పరిసరాల్లో న్యాయవాది అనిల్‌కుమార్ వాహనాన్ని పోలీస్ అధికారి ధ్వంసం చేయడాన్ని ఖండించారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని కోరారు. కార్యక్రమంలో న్యామవాదులు విఎన్ గౌడ్ , రాజలింగం, సంతోష్, తాజ్‌ఖాన్, రాజురెడ్డి, మురళీ, మల్లేష్, భీమేష్ ఉన్నారు.
న్యాయవాదుల విధుల బహిష్కరణ


