బృహత్ లక్ష్యం.. నిర్లక్ష్యం
నర్వ: వృక్ష సంపదను పెంచేందుకు.. గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూర్చేందుకు గత ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటుచేసింది. కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమంతో ప్రజలకు ఏ ప్రయోజనం ఉందా.. లేదనేది పక్కనబెడితే నిధులు మాత్రం రూ.లక్షలు ఖర్చయ్యాయి. బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటులో భాగంగా అధికారులు హడావుడిగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి.. మొక్కలు నాటారు. కొన్నిచోట్ల ఆదారబాదరగా స్థలాలను గుర్తించిన అధికారులు.. తూతూ మంత్రంగా మొక్కలు నాటి మమ అనిపించారు. ఒక్కో బృహత్ ప్రకృతివనంలో దాదాపు 31వేల మొక్కలు నాటినట్లు అక్కడ ఏర్పాటుచేసిన బోర్డుల్లో లెక్కలున్నాయి. వనాల్లో మాత్రం నామమాత్రంగానే మొక్కలు ఉన్నాయి. నాటిన మొక్కలను సంరక్షించేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రకృతివనాలు ఏర్పాటుచేసిన స్థలాలు చౌడు, గుట్ట నేలలు కావడంతో నాటిన మొక్కలు చాలా వరకు పెరగడం లేదు. మాగనూర్, నర్వ, ఊట్కూర్ తదితర మండలాల్లో నాటిన మొ క్కలు కనిపించకపోగా.. బోర్డులు, గేట్‌లను ఎత్తుకుపోయ్యారు. పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది.
జిల్లాలో కార్యక్రమం ఇలా..
జిల్లాలోని 11 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటుచేశారు. ప్రారంభంలో ప్రతి మండలానికో బృహత్ వనాన్ని కేటాయించారు. తర్వాత వాటి సంఖ్యను 5కు పెంచారు. జిల్లాలో మొత్తం 55 బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటు కోసం అధికారులు స్థలాలను గుర్తించి మొక్కలు నాటారు. దాదాపు 2 నుంచి 5 ఎకరాల పరిధిలో వనాలు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల గ్రామాలకు దూరంగా వనాలను ఏర్పాటు చేయడం.. కంచె ఏర్పాటు చేయకపోవడం వల్ల పశువులు, మేకలు మొక్కలను తినేస్తున్నాయి.
కనిపించని మొక్కలు..
బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో నేరేడు, చింత, సీతాఫలం, మారేడు, తంగెడు, కానుగ, టేకోమా, నిమ్మ, గుల్మహార్, జామ, మామిడి, టేకు, వెదురు, పనస వంటి మొక్కలతో పాటు భారీ వృక్షాలుగా ఎదిగే మొక్కలను నాటారు. అయితే ప్రస్తుతం అక్కడక్కడ జామ, ఇతర మొక్కలు తప్ప ఇతర మొక్కలు ఏవీ కనిపించడం లేదు.
ఇలా చేస్తే మేలు..
గ్రామాలకు చేరువలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఉంటే ఎవరైనా వెళ్తారు. సంరక్షిద్దామన్నా ఆలోచన కలుగుతుంది. సేకరించిన స్థలం చుట్టూ కందకం తవ్వాలి. అలా తవ్వితే పశువులు, మేకలు వెళ్లడానికి వీలు లేకుండా ఉంటుంది. ఎక్కడో దూరంగా పనికిరాని భూమిలో మొక్కలు నాటడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
క్రీడలతో పోటీతత్వం
క్రీడలతో పోటీతత్వం పెరుగుతుందని, గెలు పోటములు సహజమని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు.
–8లో u


