బాలికల కోసం అథ్లెటిక్స్ పోటీలు
● జిల్లాస్థాయిలో
అస్మిత ఖేలో ఇండియా లీగ్
● అండర్–14, 16 విభాగాల్లో పోటీల నిర్వహణ
మహబూబ్‌నగర్ క్రీడలు: బాలికల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ‘ఖేలో ఇండియా’ పోటీలకు శ్రీకారం చుట్టారు. దేశంలోని 26 రాష్ట్రాల్లోని 300 జిల్లాల్లో ఖేలో ఇండియా అస్మిత (అచీవింగ్ స్పోర్ట్స్ మైల్‌స్టోన్ బై ఇన్‌స్పైరింగ్ ఉమెన్) లీగ్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈనెల 10 నుంచి ప్రారంభమైన పోటీలు 30వ తేదీ వరకు జరగనున్నాయి. అండర్–14, అండర్–16 విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలు బాలికలకు సువర్ణ అవకాశంగా మారనుంది.
● అండర్–14 ఏళ్ల లోపు బాలికలు 21.12.2011 నుంచి 20.12.2013 ఽమధ్య పుట్టి ఉండాలి, అండర్–16 ఏళ్లలోపు బాలికలు 21.12.2009 నుంచి 20.12.2011 మధ్య పుట్టిన వారు పోటీల్లో పాల్గొనడానికి అర్హులు.
● నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఈ నెల 10వ తేదీన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించగా ఈనెల 14వ తేదీన మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో, 17వ తేదీన నారాయణపేట జిల్లాల్లో జరగనున్నాయి. ఈ పోటీల్లో బాలికల ప్రతిభను గుర్తించడానికి ఒక్కో జిల్లాకు ఇద్దరు పరిశీలకులు రానున్నారు.
పోటీలు జరిగే విభాగాలు..
అండర్–14: ట్రయథ్లాన్ గ్రూప్–ఏలో 60 మీ. లాంగ్‌జంప్ (5 మీ.), హైజంప్ (సీజర్), గ్రూప్–బీ 60 మీ., లాంగ్‌జంప్ (5మీ), బ్యాక్ త్రో (1 కేజీ), గ్రూప్–సీ 60 మీ., లాంగ్‌జంప్ (5 మీ.), 600 మీ.పరుగు, జావెన్‌త్రో.
అండర్–16: ట్రయథ్లాన్ 60 మీ., 600 మీ.పరుగు, హైజంప్ (సీజర్), లాంగ్‌జంప్ (5 మీ.), డిస్కస్‌తో, షాట్‌పుట్, జావెలిన్ త్రో అంశాల్లో పోటీలు జరగనున్నాయి.


