డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
కోస్గి: మాదకద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో ‘అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం – అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం–2025’పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాల్సిన కొందరు యువత డ్రగ్స్‌కు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం విద్యార్థిలోకం నడుం బిగించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్‌ఐలు పురుషోత్తంరెడ్డి, అబ్దుల్ జబ్బార్, శ్రావణి పాల్గొన్నారు.
న్యాయవాదులరక్షణ చట్టం తేవాలి
నారాయణపేట రూరల్: న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట గేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు న్యాయవాదులు చేపట్టనున్న పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్, ఉ పాధ్యక్షుడు నందు నామాజీ, ప్రధాన కార్య దర్శి చెన్నారెడ్డి, న్యాయవాదులు రఘువీర్ యాదవ్, సీతారామారావు, మల్లికార్జున్, బాల ప్ప, నారాయణ పాల్గొన్నారు.
న్యాయం చేయాలంటూ రాస్తారోకో
నారాయణపేట రూరల్: తమకు విక్రయించిన ఇంటి స్థలాలను బలవంతంగా లాక్కునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని.. తమకు న్యాయం చేయాలంటూ మంగళవారం బాధితులు రోడ్డెక్కారు. మండలంలోని జాజాపూర్‌లో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయా యి. వివరాల్లోకి వెళ్తే... జాజాపూర్‌కు చెందిన కోట్ల వెంకట్‌రెడ్డి 2008లో 3.30 ఎకరాల భూమిని 82 ప్లాట్లు చేసి.. వివిధ వర్గాలకు చెందిన 40మందికి పైగా విక్రయించారు. ఆయన కుమారుడు రవీందర్ రెడ్డి ఆ భూమి తన పే రుపై ఉందని చెప్పడంతో.. ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ విషయమై కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి చేరుకొని రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ రాముడు, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చ జెప్పారు. కాగా, ఈ విషయమై రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసు కోర్టులో ఉందని, కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామన్నారు.
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత


