ప్రతిభను వెలికి తీయవచ్చు..
ఖేలో ఇండియా అస్మిత లీగ్‌తో బాలికల్లో దాగి ఉన్న అథ్లెటిక్స్ ప్రతిభను వెలికితీయవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాలోని బాలికలు పాల్గొని తమ ప్రతిభను చాటాలి. నారాయణపేట జిల్లాకేంద్రంలో ఈనెల 17వ తేదీన జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నాం. – రమణ, జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి, నారాయణపేట
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే..
జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈనెల 14వ తేదీన జిల్లాస్థాయిలో అండర్–14, 16 విభాగాల బాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నాం. ఎన్‌ఎస్‌ఆర్‌ఎస్ పోర్టల్‌లో ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆసక్తి గల బాలికలు ఆన్‌లైన్ దరఖాస్తు కాపీతో పాటు జనన ధ్రువీకరణ పత్రం, తహసీల్దార్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం, పాఠశాల బోనఫైడ్‌తో స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలి.
– జి.శరత్‌చంద్ర, జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి, మహబూబ్‌నగర్
●
ప్రతిభను వెలికి తీయవచ్చు..


