బేరసారాలు షురూ.. | - | Sakshi
Sakshi News home page

బేరసారాలు షురూ..

Nov 11 2025 7:34 AM | Updated on Nov 11 2025 7:34 AM

బేరసారాలు షురూ..

బేరసారాలు షురూ..

నారాయణపేట: ప్రస్తుత మద్యం పాలసీ ఈ నెల 30న ముగియనుండగా.. 2025–27కు సంబంధించి కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభమవుతాయి. అయితే లక్కీడ్రాలో మద్యం దుకాణాలు దక్కిన వారితో వ్యాపారులు బేరసారాలను మొదలుపెట్టారు. తమకు దుకాణం అప్పగిస్తే భారీగా నజరానా ఇస్తామంటూ గాలం వేస్తున్నారు. ఎలాంటి అనుభవం లేకున్నా.. లక్కీడ్రాలో అదృష్టం వరించిన వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తోంది. జిల్లావ్యాప్తంగా 33 మద్యం దుకాణాలు ఉండగా.. ప్రధానంగా కృష్ణా, ఊట్కూర్‌ వైన్స్‌లపై లిక్కర్‌ వ్యాపారుల కన్నుపడింది. దుకాణాలు తమకు ఇస్తారా అని అడగడమే ఆలస్యం.. మరి రూ.కోటి ఇస్తారా అంటూ టెండరుదారులు అడుగుతున్నట్లు తెలుస్తోంది.

కొత్త దుకాణాల ఏర్పాటుకు సన్నద్ధం..

ద్యం టెండర్ల ప్రక్రియ ముగియడంతో మరో 20 రోజుల్లో కొత్త దుకాణాలను తెరిచేందుకు వ్యాపారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రంలో మూడు గ్రూపులకు వేర్వేరుగా సిండికేటులో దుకాణాలు దక్కాయి. ఎవరికి వారే దుకాణాల నిర్వహణకు సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం దుకాణాలు కొనసాగిస్తున్న అడ్డాలపై కన్నేశారు. అయితే తమ అడ్డా ఇవ్వాలంటే భాగస్వామ్యం ఇవ్వాలంటూ కొందరు.. తమ దుకాణం ఇవ్వలేమంటూ మరికొందరు.. యజమానితో మాట్లాడుకోండి అంటూ ఇంకొందరు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దుకాణాలు దక్కిన వారు మరో చోట దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

● సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గౌడ సామాజిక వర్గాల వారికి కేటాయించిన రిజర్వేషన్ల ద్వారా తమ లక్కును పరీక్షించుకున్న వారి పంట పండనుంది. సిండికేటు వ్యాపారులు లిక్కర్‌ వ్యాపారాన్ని ఎలాగైనా మళ్లీ చేజిక్కించుకోవాలని తమ పరిచయస్తులు, స్నేహితులతో జనరల్‌, రిజర్వు మద్యం దుకాణాలకు టెండర్లు వేశారు. అయితే కొందరు తమకు భాగస్వామ్యం ఇవ్వాలని.. మరికొందరు తాము డబ్బులు ఇవ్వలేము.. ఆధార్‌కార్డు మాత్రమే ఇస్తామని మద్యం దుకాణాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఒకటి, రెండు దరఖాస్తులకే దుకాణాలు దక్కడంతో వామ్మో తమ పేరుపై ఇంత బలముందా అంటూ అవాక్కయ్యారు. అయితే వైన్స్‌ నడిపేందుకు తమకు టీడీఎస్‌ ఇవ్వాలని.. లేదా ఇతరులకు అమ్మితే ప్రతినెలా కొంత మొత్తం, టీడీఎస్‌ ఇవ్వాల్సిందేనంటూ షరతులు పెడుతున్నారు. దీంతో అదృష్టమంటే వారిదేనంటూ వ్యాపారులు చర్చించుకుంటున్నారు.

చిరుతల సంచారం

మద్దూరు మండలంలో చిరుతల సంచా రం పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

–8లో u

నిబంధనల మేరకు..

మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ఎక్కడ దుకాణం ఏర్పాటు చేస్తారు.. ఎవరి పేరిట దుకాణం పెడుతున్నారనే వివరాలను ఎకై ్సజ్‌ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. గుడి, బడి, ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలో దుకాణం ఉండాలి. నిబంధనల ప్రకారం దుకాణం ఏర్పాటు చేస్తున్నారా.. లేదా అనే విషయాలను అధికారులు పరిశీలించిన తర్వాతే లైసెన్స్‌ జారీ చేస్తారు.

– అనంతయ్య, ఎకై ్సజ్‌ సీఐ

లెక్కల్లో వ్యాపారులు..

జిల్లాలోని ఏ మద్యం దుకాణం లెక్కలు చూసినా ఏడాదికి రూ. 10కోట్లకు తక్కువగా లేవంటూ వ్యాపారుల లెక్కల్లో తేలింది. దీంతో ప్రభుత్వానికి చెల్లించే రెంటల్‌కు పదింతలు అమ్మకాలకు మొదటగా 16 నుంచి 20శాతం మార్జిన్‌, ఆ తర్వాత విక్రయించే మద్యానికి 6 నుంచి 10 శాతం మార్జిన్‌ ఉండటంతో మద్యం దుకణాలను ఎలాగైనా దక్కించుకోవాలని సిండికేటు వ్యాపారులతో పాటు తమ దుకాణాలను తామే సొంతంగా నడుపుకుంటామంటూ కొత్త వ్యాపారులు సిద్ధమవుతున్నారు. మండలాల్లో గ్రామాల వారీగా బెల్టుషాపులు, దాబాల నిర్వాహకులను కలిసి ఈ సారి వైన్స్‌ తమకే వచ్చిందని.. తమతోనే మద్యం తీసుకోవాలంటూ ముందుగానే చర్చలు మొదలుపెట్టారు.

మద్యం దుకాణాలు దక్కిన వారితో వ్యాపారుల మంతనాలు

వైన్స్‌ తమకు అప్పజెప్పాలంటూ గాలం

కృష్ణా, ఊట్కూర్‌ వైన్స్‌ల కోసం తీవ్ర పోటీ

భారీగా నజరానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement