అడ్డగోలుగా నియామకాలు! | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా నియామకాలు!

Nov 11 2025 7:34 AM | Updated on Nov 11 2025 7:34 AM

అడ్డగోలుగా నియామకాలు!

అడ్డగోలుగా నియామకాలు!

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో అధికారులు అడ్డగోలుగా సిబ్బంది నియామకం చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి నోటిఫికేషన్‌, పత్రికా ప్రకటన, రోస్టర్‌ విధానం వంటి ప్రక్రియలు చేపట్టకుండా నేరుగా సిబ్బందిని పైరవీల ద్వారా తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గద్వాల పీజీ సెంటర్‌, కొల్లాపూర్‌ పీజీ సెంటర్‌, పీయూతో పాటు సుమారు 35 నుంచి 36 మంది వరకు సిబ్బందిని వివిధ ఏజెన్సీల ద్వారా నియమించినట్లు సమాచారం. ఇందులో కుక్‌, హెల్పర్‌, కేర్‌ టేకర్‌, వాచ్‌మెన్‌ వంటి పోస్టులు ఉన్నాయి. నేరుగా ఏజెన్సీల ద్వారా వీరిని నియమించడంతో ఏజెన్సీలకు పలువురు మధ్యవర్తులుగా ఉండి తమకు కావాల్సిన వారిని చేర్పించారు. ఈ క్రమంలో పలు పోస్టులకు సిబ్బంది నుంచి డబ్బులు సైతం వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ద్వారా వేతనాలు చెల్లిస్తూ.. ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి వసతులు కల్పిస్తూ నియమించే ఉద్యోగాలకు బయటి వ్యక్తులు, ఏజెన్సీలు నియమించుకోవడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. సిబ్బందిని నియమించిన తర్వాత ఆర్డర్లు సైతం ఇవ్వకుండా అధికారుల వద్దే పెట్టుకొని.. నేరుగా వేతనాలు ఇస్తున్నారు.

ఉన్న వారికి జీతాలేవీ?

పీయూలో పనిచేస్తున్న 42 మంది పార్ట్‌టైం లెక్చరర్లకు కొన్ని నెలలుగా పూర్తిస్థాయిలో వేతనాలు అందడం లేదు. పని ఒత్తిడి తగ్గించడంతో వేతనాలు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలల వేతనాలు ఇవ్వలేదు. దసరా, దీపావళి పండగలకు సైతం వేతనాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు సెక్యూరిటీ సిబ్బందికి సైతం రెండు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉండగా 10 రోజుల క్రితం ఒకనెల వేతనం రూ.10 వేలు ఖాతాలో జమచేశారు. గతంలో రూ.11 వేలు ఇవ్వగా ప్రస్తుతం దాన్ని రూ.వెయ్యి తగ్గించి ఇవ్వడాన్ని సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేతనం పెంచాల్సింది పోయి తగ్గించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

పాలమూరు యూనివర్సిటీలో పైరవీలకు పెద్దపీట

ఇటీవల గద్వాల పీజీ సెంటర్‌లో 14,

కొల్లాపూర్‌ సెంటర్‌లో 11 మంది నియామకం

యూనివర్సిటీలోనూ

9 మంది వరకు అవకాశం..

ఎలాంటి ప్రకటనలు, రోస్టర్‌ విధానం లేకుండా చేపట్టడంపై విమర్శలు

మధ్యవర్తులు చెప్పిన వారికే ఉద్యోగాలు?

ఎక్కడెక్కడ ఎంత మంది..

మూడు నెలల క్రితం గద్వాల పీజీ సెంటర్‌లో బాలికలు, బాలుర హాస్టళ్లను అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో రెండు హాస్టళ్లకు సంబంధించి ఇద్దరు కుక్‌, ఇద్దరు హెల్పర్‌, ఒక కేర్‌ టేకర్‌, 9 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. అలాగే కొల్లాపూర్‌ పీజీ సెంటర్‌లో 9 మంది సెక్యూరిటీ సిబ్బంది, కేర్‌టేకర్‌, కుక్‌, హెల్పర్‌ ఒక్కొక్కరిని నియమించారు. అయితే ఈ ప్రక్రియలో పలువురు మధ్యవర్తులుగా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు పీయూలో కేర్‌టేకర్లు, కుక్‌లు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. ఇందులో ఓ మహిళా అధికారి ప లువురు సిబ్బందిని నియమించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. పలువురు సిబ్బందితో డబ్బులు తీసుకోవడంతో పాటు భవిష్యత్‌లో నియమించే పోస్టులకు సైతం ముందస్తు ఒప్పందాలను సదరు మహి ళ చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు ఏజెన్సీ లో పనిచేసే మరో వ్యక్తి సైతం సిబ్బంది ని యామకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలన్నీ వీసీ, రిజిస్ట్రార్‌లకు తెలిసినా వారికే మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement