ఉత్సాహంగా జిల్లా అథ్లెట్ల ఎంపికలు
మక్తల్: పట్టణంలోని క్రీడా మైదానంలో సోమవారం ఎస్‌జీఎఫ్ అండర్–14, 15, 16, 17 బాలబాలికల విభాగాల్లో జిల్లా అథ్లెట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో బాలబాలికలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. ముందుగా డీవైఎస్‌ఓ వెంకటేశ్ శెట్టి క్రీడాకారులను పరిచయం చేసుకొని ఎంపిక పోటీలను ప్రారంభించారు. అత్యంత ప్రతిభకనబరిచిన క్రీడాకారులను ఈ నెల 12న నిర్వహించే ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, రాకేశ్ శర్మ, కొండయ్య, కోళ్ల వెంకటేశ్, గణేశ్‌కుమార్, లక్ష్మీనారాయణ, నర్సింహ, విష్ణువర్ధన్‌రెడ్డి, కట్ట సురేశ్ పాల్గొన్నారు.


