ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి
విద్యాశాఖ టీచర్లకు ఎన్నో రకాల కొత్త రకమైన బోధనకు తరచు శిక్షణలు ఇస్తుంది. ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడే ఆయుధం సీపీఆర్ పై ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలి. ప్రతి గ్రామంలో తప్పకుండా పాఠశాల ఉంటుంది. అక్కడ టీచర్లు పనిచేస్తున్నారు. ఏ గ్రామంలోనైనా గుండెపోటు సంబంధిత ఇబ్బందులు వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది. స్థానికంగా ఉండే టీచర్ల సహాయంతో సీపీఆర్ చేయగలిగితే కొంతవరకు ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.
– మోల్గన్ జనార్ధన్, ఉపాధ్యాయుడు, షేర్నపల్లి
అందరూ నేర్చుకోవాలి
ఆరోగ్య సమస్య వచ్చిన ప్రతి చోట వైద్యులు అందుబాటులో ఉండరు. ద గ్గరలోని ఆసుపత్రికి తీ సుకుని వెళ్లడానికి నిమిషాలు, గంటల సమ యం పడుతుంది. అంతలోపు ప్రథమ చికిత్స, సిపిఆర్ వంటి సేవలపై అవగాహన కలిగి ఉంటే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. యువత, మహిళలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు తప్పకుండా శిక్షణ పొందాలి. – డాక్టర్ విరోజ,
ఆరోగ్య ఉప కేంద్రం, చిన్నజట్రం
●
ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి


