
రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి
శిరివెళ్ల: నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌కు చెందిన బచ్చు రాఘవేందర్ (36) మృతి చెందాడు. ప్రకాఽశం జిల్లా గిద్దలూరులో ఉన్న తన బంధువులను చూడడానికి కారులో వెళ్తూ మార్గమధ్యలో పచ్చర్ల వద్ద మూత్ర విసర్జన కోసం కారు దిగాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో రాఘవేందర్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండంగా మృతి చెందాడు. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భార్యను చంపిన భర్త అరెస్ట్
మంత్రాలయం: అనుమానం పేరుతో తాగిన మైకంలో భార్యను హతమార్చిన భర్త హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ శివాంజల్ మాట్లాడుతూ.. సూగూరు గ్రామానికి చెందిన బోయ హనుమంతు ఆయన భార్య లక్ష్మిదేవి నిద్రిస్తున్న సమయంలో మేడిగుంజతో తలపై బాది హత్య చేశారని, అనుమానం పేరుతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నారన్నారు. చెట్నెహళ్లి గ్రామ మార్గంలోని అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో హనుమంతును అరెస్టు చేశామన్నారు.

రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి