
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
శ్రీశైలం రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటిమట్టం 875 అడుగులకు పైగా చేరుకుంది. తుంగభద్ర, హంద్రీ నది నుంచి వరదనీరు వస్తుండటంతో రిజర్వాయర్‌లో 167.48 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు గేట్ల నుంచి వారం రోజుల క్రితమే సాగునీటిని విడుదల చేసే అవకాశం కలిగింది. శ్రీశైలం డ్యాంలో 854 అడుగులకు నీటిమట్టం చేరిన తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి నీరిచ్చేందుకు అవకాశమున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పక్క రాష్ట్రానికి చెందిన ప్రభుత్వానికి భయపడి, కేఆర్‌ఎంబీ నిర్ణయం సాకు చూపించి, ప్రజలకు కనీసం తాగునీటికి సైతం విడుదల చేయలేపోయింది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.