నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని సబ్‌జైల్‌ను సోమవారం మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు పరిసరాలు, వంట, స్నానపు, తదితర గదులు పరిశీలించి సూచనలు చేశారు. ఖైదీల ఆరోగ్య వివరాలను ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసిన తప్పులను వలన కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలను కోల్పోతామని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని ఘర్షణలు, వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఖైదీలకు సూచించారు. ఆయన వెంట జైలర్ గురు ప్రసాద్ రెడ్డి, న్యాయవాది నాయక్, లోక్‌అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.
సుబ్రమణ్యేశ్వరుడి హుండీ ఆదాయం రూ. 25 లక్షలు
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ. 25 లక్షలు వచ్చింది. సోమవారం భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా..రూ. 25,03,320 నగదు, 8.600 గ్రాముల బంగారం, 830 గ్రాముల వెండి వచ్చింది. మార్చి 28 నుంచి జూన్ 30వ తేదీ వరకు భక్తుల సమర్పించిన కానుకలను లెక్కించగా ఈ ఆదాయం వచ్చినట్లు ఈఓ రామకృష్ణ తెలిపారు. అలాగే భక్తులు సమర్పించిన బియ్యానికి వేలం పాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తనిఖీ అధికారి హరిచంద్రారెడ్డి పాల్గొన్నారు.
అన్నప్రసాద వితరణకు విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి సోమవారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన దురుదుండప్ప మనూరు రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు దేవికకు అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన బి.కృష్ణారెడ్డి రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు రవికుమార్‌కు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతలను దేవస్థానం తరుపున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.

జడ్జి ఆకస్మిక తనిఖీ