
చిట్టడవి కాదు ఆయకట్టు భూమి
ఇది తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ సమీపంలోని చెరువు కింద ఉన్న ఆయకట్టు భూమి. చెరువు నీరు అందక ముళ్ల కంపలతో చిట్టడవిని తలపిస్తోంది. జొన్నగిరి చెరువు కింద 160 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. వరి పంటతో కళకళలాతూ ఉండేది. సరైన వర్షాలు లేక చెరువు నిండకపోవడంతో నీరు రాక ఆయకట్టు భూమిలో ముళ్ల కంపలు దట్టంగా పెరిగాయి. ముళ్ల కంపలు తొలగించి వరిపంట సాగు చేసే స్థోమత రైతులకు లేదు. హంద్రీ– నీవా నీటిని చెరువుకు ఇస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చినా ఇంత వరకు సాధ్యం కాలేదు. చెరువులో నీళ్లు లేకపోతే ఏటా వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంటోంది. ఆకట్టు సాగు మాట అటుంచితే కనీసం తాగునీటి ఎద్దడి నివారణకై నా ప్రభుత్వం స్పందించాలని జొన్నగిరి గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. – తుగ్గలి